వైస్సార్ బయోపిక్ ‘యాత్ర’

0

 

 

 

 

 

 

 

 

 

 

 

వైస్సార్ జీవిత కథ ఆధారంగా తాజాగా బయో పిక్ తెరకెక్కనుంది .వైస్సార్ బయో పిక్ ను 30 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీలో వైస్సార్ రోల్ లో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. సినిమా టైటిల్ ను ‘యాత్ర’ గా డిసైడ్ చేసారు. మూవీ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. “కడప దాటి ప్రతి గడపలోకి వస్తున్నాను. మీతో కలిసి నడవాలనివుంది మీ గుండె చప్పుడు వినాలనుంది”అన్న పంచ్ లైన్ లు ఆకట్టుకుంటున్నాయి. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో మడమతిప్పని వీరుడు,మునిగిపోతున్న కాంగ్రెస్ నావను ఒంటిచేత్తో ఒడ్డుకు చేర్చిన మొనగాడు,పాద యాత్ర తో ప్రభంజనం సృష్టించిన నాయకుడు వైస్సార్ .అప్పటి రాజకీయాల్లో వైస్ కు కొన్ని ప్రత్యేక పేజీలున్నాయి. మహానేతగా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్ రెడ్డి బయో పిక్ పై చాల అంచనాలున్నాయి.యాత్ర పేరిట తెరకెక్కిస్తున్న వైస్సార్ బయోపిక్ డైరెక్టర్ మహి వి రాఘవ్. కథను మహి స్వయంగా తరారుచేసుకున్నాడు .విజయ్ చిల్ల , శశిదేవి రెడీ నిర్మాతలు.70MM ఎంటర్టైన్మెంట్స్ బ్యాంనేర్ లో యాత్ర ను నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో పాదయాత్ర ఘట్టాన్ని అరగంట పాటు చూపించనున్నారు. ఇందులో జగన్ పాత్రను తమిళ హీరో సూర్య పోషించనున్నారు.ఈ సినిమా లో వైస్ తండ్రి రాజారెడ్డి ప్రస్తావన కూడా ఉంటుందని టాక్ వినిపిస్తుంది.రాజా రెడ్డి పాత్రలో తమిళ నటుడు రాజ్ కిరణ్ కనిపించే అవకాశం ఉంది.అలాగే వైయస్ కుటుంబీకులు,సన్నిహితుల పాత్రలు కూడా కనిపించనున్నాయి.

Share.

About Author

Leave A Reply