‘త్రివిక్రమ్’, ‘అల్లు అర్జున్ కాంబినేషన్లో కొత్త సినిమా రాబోతున్న సంగతి అందరికి తెలిసిందే..అయితే ఈ చిత్ర క్రొత్త షెడ్యూల్ హైదరాబాదులో కొనసాగిస్తున్నారు..ఈ సినిమాల్లో హీరోయిన్ పూజ హీగ్దే ఇంతకు ముందే ఎంపిక కాగా..రెండవ కధానాయికగ ‘నివేద పెతురాజ్’ ను ఎంపిక చేసినట్లు చిత్ర బృందం అధికారప్రకటన ద్వారా తెలిసిందే..అలాగే సీనియర్ నటి ‘టబు’, ‘సుశాంత్’ లు కీలక పాత్రలలో నటించబోతున్నారు.

ఈ చిత్రానికి మరొక ఆకర్షణగా అందాల భామ ‘కాజల్’ కూడా యాడ్ అయ్యారు. ఇప్పటికే ఈమె స్టార్ హీరోయిన్ గ తన చిత్రాలలో బిజీగ ఉంటూ.. ఐటెం సాంగ్స్ కి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు.జూనియర్ న్.టి.ర్ సరసన వచ్చిన ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో “నేను పక్క లోకల్ ” అంటూ మాస్ ప్రకాశకులను ఉరూతలూగించింది ఈ ముద్దు గుమ్మా.

ఇప్పుడు మరొక్కసారి కుర్రకారుని అలరించడానికి బన్నీతో తీన్మార్ స్టెప్ లు వేయడానికి రెడీ అవుతుంది.’ఆర్య-2 ‘ ‘ఎవడు’ సినిమాల తర్వాత బన్నీతో జతకడుతున్నమూడోవ చిత్రం ఇది.’త్రివిక్రమ్’ తన సినిమాల్లో ఐటెం సాంగ్స్ కు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు.ఇటు బన్నీ ఫాన్స్ కోసం అటు మాస్ ప్రేక్షకుల కోసం త్రివిక్రమ్ ఈ ఐటెం సాంగ్ తీసున్నాడు.బన్నీ డాన్స్ కోసం ప్రత్యకంగా చెప్పనవసరం లేదు..మరి తనతో సమానంగా ‘కాజల్’ ఎలా డాన్స్ చేస్తుందో తేరుపైన చూడాలి మరి..

Share.

About Author

Leave A Reply