వారేవా దేవ్

0

‘మన్మధుడు’, ‘కింగ్’, ‘మాస్’… ఈ పేర్లు నాగార్జునకి భలే సెట్ అయిపోతాయి. ‘అల్లరి అల్లుడు’ నుంచి ‘అన్నమయ్య’ వరకూ… ఏ పాత్ర అయినా భలే సూటైపోతుంది. అందుకే నాగ్… ఆల్ రౌండర్ అయిపోయాడు. అందరూ నాగ్ గ్లామర్ ని చూసి ఆకర్షితులవుతుంటే .. ‘వయసు’ మాత్రం వికర్షణ శక్తికి లోనై దూరంగా పోతుందేమో. అందుకే.. ఇప్పటికీ ఆయన నవ ‘మన్మధుడు’గానే కనిపిస్తుంటారు. నాగార్జున పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేసిన ‘దేవ దాస్’ లుక్ చూస్తుంటే నాగ్ మరో పదేళ్లు వెనక్కి వెళ్ళినట్టే అనిపిస్తుంది. పొడుగాటి కోటు, నెత్తి మీద టోపీ, కళ్ళజోడు పెట్టుకుని సరికొత్తగా కనిపిస్తున్నారు. నాగార్జున, నాని కథానాయకులుగా నటించిన చిత్రం ‘దేవదాస్’. ఇది వరకే టీజర్ విడుదలైంది. బుధవారం నాగార్జున పుట్టిన రోజు.ఈ సందర్భంగా ‘దేవ్‘గా నాగ్ గెటప్ ని విడుదల చేసారు. అశ్వినీదత్ నిర్మిస్తున్న చిత్రమిది. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. బుధవారం ఈ చిత్రంలోని తొలి గీతాన్ని విడుదల చేయబోతున్నారు. రష్మిక, ఆకాంక్ష సింగ్ కథానాయికలు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం విడుదల కానుంది. సంగీతం: మణిశర్మ.

Share.

About Author

Leave A Reply