ఇది బయోగ్రఫీ కాదు.

0

దర్శకుడు జనార్ధన మహర్షి నూతనంగ తెరకెక్కించబోతున్న చిత్రం ‘విశ్వ దర్శనం’. ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌ జీవితం ఆధారంగా తీస్తున్న ఏ చిత్రానికి టి.జి. విశ్వప్రసాద్‌ నిర్మాత. ఇటీవలే ఈ ప్రచార చిత్రాన్ని మంగళవారం కె.విశ్వనాథ్‌ గారి పుట్టిన రోజు సందర్భంగా సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా విశ్వనాథ్‌ మాట్లాడుతూ ‘‘నేను చాలా గొప్పవాడ్ని, నా గురించి అందరికీ తెలియాలి.. అనే ఆశ నాకు లేదు. మనల్ని అభిమానించేవారి కోసం కొన్నిసార్లు కొన్ని పనులు చేయాలి. ఈ ఆలోచనకు కర్త, కర్మ, క్రియ మొత్తం జనార్ధన మహర్షినే అన్నారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ విశ్వనాథ్‌గారికి పరమ భక్తుడు జనార్ధన మహర్షి. ఈ సినిమాతో డబ్బులెన్ని వస్తాయో తెలీదు గానీ, కీర్తి మాత్రం గట్టిగానే మూటగట్టుకుంటాడన్నారు. దర్శకుడు మాట్లాడుతూ విశ్వనాథ్‌ గారే నాకు గురువు, దైవం. ఇది బయోగ్రఫీ కాదు. ఓ మహా దర్శకుడి వల్ల సమాజంలో ఎలాంటి మార్పు వచ్చిందో చూపిస్తున్నాం అన్నారు. 

Share.

About Author

Leave A Reply