అందుకే ఎన్టీఆర్‌ సినిమాలో నటించలేదు

0

 

ఒకప్పుడు గొప్ప సినీ కథానాయికగా వెలుగొందిన నటి లయ దాదాపు అన్ని భాషల్లో నటించారు.ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కలిపి దాదాపు 60 సినిమాల్లో నటించారు. ఆమె ఒక క్లాసికల్ డాన్సర్ గ జీవితాన్ని ప్రారంభించి 50కుపైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చి మంచి డ్యాన్సర్‌ గానూ గుర్తింపు తెచ్చుకున్నారు. 2006లో వివాహం చేసుకున్న లయ తర్వాత ఆమె నటనకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం లయ కుటుంబంతో కలిసి లాస్‌ఏంజెల్స్‌లో ఉంటున్నారు.

చాలా ఏళ్ల తర్వాత లయ ఇటీవల రవితేజ ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించారు. ఇందులో ఆమె కథానాయిక ఇలియానా (బాల్యంలోని పాత్రకు) తల్లిగా నటించారు. కాగా ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత’ సినిమాలోని ఓ పాత్ర కోసం దర్శక, నిర్మాతలు ఆమెను సంప్రదించారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆ ఆఫర్‌ను ఆమె తిరస్కరించారని తెలిసింది. ఈ విషయం గురించి లయ తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘నేను తల్లి, సోదరి, వదిన పాత్రలకు ఇప్పట్లో సరిపోను అనిపించింది. అందుకే ‘అరవింద సమేత’ సినిమా అవకాశాన్ని తిరస్కరించాను. కానీ నాకు నటించడం అంటే ఇష్టం. నాకు సరిపోయే మంచి పాత్రలు వస్తే మళ్లీ తిరిగి టాలీవుడ్‌కు రావాలని ఉంది’ అని ఆమె చెప్పారు.

Share.

About Author

Leave A Reply