మనవడు తాతల..

0

మనవడు తాతల..
‘ఎన్టీఆర్’ బయోపిక్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.ఒక్కో లుక్ బయటకు వస్తోంది. ఆమధ్య నారా చంద్రబాబు నాయుడు పాత్రధారి దగ్గుబాటి రానా లుక్ ని విడుదల చేసారు.అప్పట్లో చంద్రబాబు ఎలా ఉండేవారో, అచ్చమ్ అలానే రానా ముఖ కవళికలు ఉండేసరికి..నందమూరి అభిమానులు సంబరపడ్డారు.ఇప్పుడు అక్కినేని రూపం బయటకు వచ్చేసింది అక్కినేని నాగేశ్వరావుగా ఆయన మనవడు సుమంత్ నటిస్తున్న సంగతి తెలిసిందే.గురువారం నాగేశ్వరావుగారి జయంతి.

ఈ సందర్భంగా ‘ఎన్టీఆర్’ లోని నాగేశ్వరావు లుక్ ని బయటకు తీసుకొచ్చారు. ఈ లోక్ లో సుమంత్ తాతయ్యని గుర్తుకు తెచ్చారు. ఆ కళ్ళు..నవ్వు.. అచ్చమ్ అలానే ఉన్నాయి.రెండో లుక్ కూడా అభిమానులకు నచ్చేదే. అప్పట్లో ఎన్టీఆర్, నాగేశ్వరావు ఓ కార్యాక్రమంలో పాల్గొన్నప్పుడు ఇద్దరు సిగ్గరేట్లు తాగుతూ కనిపించారు.ఆ దృశ్యం వాళ్ళిద్దరి అభిమానుల్ని విపరీతంగా ఆకర్షించింది.ఇప్పుడు ఆ సన్నివేశం ‘ఎన్టీఆర్’లోనూ చూడొచ్చు. బాలయ్యకు సిగరెట్ ముట్టిస్తున్న సుమంత్ ని చూస్తుంటే..అప్పటి ఛాయా చిత్రం చూస్తునట్లే అనిపిస్తుంది క్రిష్ దర్సకత్వం వహిస్తున్నఈ చిత్రాన్ని 2019 జనవరి విడుదల చేస్తారు.

Share.

About Author

Leave A Reply