`స‌వ్య‌సాచి`…

0

ఇటీవ‌ల డైరెక్ట‌ర్ మారుతి రూపొందించిన `శైల‌జా రెడ్డి అల్లుడు` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు అక్కినేని యంగ్ హీరో నాగ‌చైత‌న్య‌. ఈ సినిమాపై చైతూ చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమాకు ఓపెనింగ్స్ బాగానే వ‌చ్చిన‌ప్ప‌టికీ ప‌లితం మాత్రం నిరాశ‌ప‌రిచింది. దీంతో త‌ర్వాతి రాబోతున్న `స‌వ్య‌సాచి`పై నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం దృష్టి సారించాడు.

విడుద‌ల విష‌యంలో `శైల‌జా రెడ్డి అల్లుడు`, `స‌వ్య‌సాచి` మ‌ధ్య వివాదం త‌లెత్తిన సంగ‌తి తెలిసిందే. అయితే `శైల‌జారెడ్డి అల్లుడు` క‌చ్చితంగా హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కంతో `స‌వ్య‌సాచి` కంటే ముందు ఈ సినిమాను విడుద‌లు చేశాడు చైతూ. కానీ, ఆశించిన ఫ‌లితం ద‌క్క‌లేదు. ఇప్పుడు `స‌వ్య‌సాచి` విడుద‌ల తేదీ గురించి ఆలోచ‌న‌లో ప‌డ్డాడు. వ‌చ్చే నెల‌లో వ‌రుస‌గా పెద్ద సినిమాలు విడుద‌ల కాబోతున్నాయి. దీంతో న‌వంబ‌ర్ నెల‌లోనే `స‌వ్య‌సాచి` ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

Share.

About Author

Leave A Reply