సరికొత్త పాత్రలో “షారుఖాన్”

0

 తాజాగా షారుఖ్‌ ఖాన్‌ మరుగుజ్జు పాత్రలో చేస్తున్నాడు. ఆ చిత్రమే ‘జీరో’. ఆనంద్‌ ఎల్‌ రారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను వచ్చే నెలలో విడుదల చేయబోతున్నారు. నవంబర్‌ రెండున షారుఖ్‌ ఖాన్‌ 53వ జన్మదినం సందర్భంగా ఈ ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. క్రిస్టమస్‌కు విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఆనంద్‌ ఎల్‌ రారు మాట్లాడుతూ ”ఈ కథ ప్రకారం షారుఖ్‌ ఖాన్‌ పొట్టిగా కనిపిస్తారు. ఈ పాత్రను ఈయన చాలా పట్టుదలతో చేశారు. ఈ సినిమా, షారుఖ్‌ నన్ను ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ సినిమాను ఇటీవల చూసినప్పుడు అంత అద్భుతమైన పాత్రను నేను ఎలా చేయించగలిగాను అని అనుకున్నా. ‘జీరో’ దర్శకుడిగా నాకు టఫ్‌, నా కంటే షారుఖ్‌కు మరీ టఫ్‌. ఇదొక కష్టమైన పాత్ర. మనుసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా మానసికంగా, శారీరకంగా ఖాళీగా వచ్చి చేశాడు. ఈ పాత్ర చేసేటప్పుడు కనీసం ఒక సెకను కూడా తడబడలేదు” అని చెప్పారు. ఖాన్‌ దర్శకుడి నటుడని, కష్టపడి పనిచేసే వ్యక్తి అని పేర్కొన్నారు ఆనంద్‌ ఎల్‌ రారు.

Share.

About Author

Leave A Reply