వివాదాల్లో త్రిష

0

సంచలన నటి త్రిష వినోదానికి పోయిందో, లేక ప్రచారాన్ని కోరుకుందో గానీ, అది కాస్తా బెడిసికొట్టి ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. ఈ అమ్మడు తరచూ విదేశాలు చుట్టొస్తున్న విషయం తెలిసిందే. అలా ఇటీవల దుబాయ్‌కు రౌండ్‌ వేసింది. అక్కడ ఒక అందమైన ఈత కొలను (స్మిమ్మింగ్‌ పూల్‌)లో చక్కగా ఈదేసింది. పనిలో పనిగా అదే కొలనులో చక్కగా విన్యాసాలు చేస్తున్న డాల్ఫిన్లను చూడగానే అమ్మడు తెగ ముచ్చట పడిపోయింది.అందులో ఒక డాల్ఫిన్‌ తెగ ముద్దొచ్చేస్తుంటే, ఆగలేక దాన్ని సమీపించి పట్టుకుని ముద్దెట్టేసింది.

ఏదైతేనేమీ త్రిష, డాల్ఫిన్‌ల ముద్దు ముచ్చట్ల ప్రహసనం ఒక రేంజ్‌లో జరిగిపోయింది. అక్కడితో ఆగలేదు. ఆ దృశ్యాలను ఈ చెన్నై చిన్నది తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. అంతే అవి సోషల్ మీడియా లో వైరల్‌ అవుతున్నాయి. ఇక్కడి వరకూ త్రిష బాగానే ఎంజాయ్‌ చేసింది. ఆమె అభిమానులు సూపర్‌ అంటూ తెగ లైక్‌ చేసేస్తున్నారు.

త్రిష పెటా అనే జీవ ప్రాణుల సంరక్షణ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే వివాదాల్లో పడేసింది. అలాంటి పెటా సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండి డాల్ఫిన్‌ లాంటి జల జీవాలను హింసిస్తుందా అంటూ జీవ ప్రాణుల సంరక్షణ సంస్థకు చెందిన వారు త్రిషపై మండిపడుతున్నారు.స్వేచ్ఛగా జీవించే డాల్ఫిన్లతో తన సరదాలు తీర్చుకోవడం? అసలు వాటి స్వేచ్ఛను హరించే హక్కు త్రిషకు ఎవరిచ్చారు? అంటూ డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ఇండియా నిర్వాహకురాలు పరిదా తంబల్‌ నటి త్రిష చర్యలను తీవ్రంగా విమర్శించారు. సముద్రంలో జీవించే ప్రాణులైన డాల్ఫిన్లు కాలక్షేప ఈత కొలనుల్లో ఎలా సహజమైన పరిస్థితి అమరుతుంది? అని ప్రశ్నించారు. అసలు డాల్ఫిన్లకు మనుషుల అలవాట్లను ఎందుకు నేర్పించాలి? వాటిని వాటి మానాన జీవించనీయండి అని ఆవేశంగా అన్నారు. దీంతో ఒక పక్క అభిమానులు డాల్ఫిన్లలో తన ముద్దు దృశ్యాలను చూసి చాలా క్యూట్‌గా ఉన్నాయని మెచ్చుకుంటుంటే మరో పక్క విమర్శకులేంటి తనపై దాడి చేస్తున్నారు? అని త్రిష తల పట్టుకుందట. ఈ అమ్మడిప్పుడు రజనీకాంత్‌కు జంటగా పేట చిత్రంలో నటిస్తోంది.

Share.

About Author

Leave A Reply