‘రామ్ చరణ్’ సినిమా లో ‘కౌశల్’…

0

‘బిగ్‌బాస్’ విజేతగా నిలిచిన కౌశల్‌కు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయట. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్నారు.

ఈ చిత్రంలో కౌశల్ కీలక పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నట్లు ఫిలిం వర్గాలు అంటున్నాయి. ‌బిగ్‌బాస్‌ ట్రోఫీ దక్కించుకున్న కౌశల్‌కు ఎందరో సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. రామ్‌చరణ్‌ చిత్రంలో ప్రముఖ నటుడు ఆర్యన్‌ రాజేశ్‌ ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ యూరప్‌లోని అజర్‌బైజాన్‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి తన తండ్రి చిరంజీవి నటించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘స్టేట్‌ రౌడీ’ పేరును టైటిల్‌గా పరిశీలిస్తున్నారట. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Share.

About Author

Leave A Reply