‘యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు‌’ మూవీ రివ్యూ..

0

టైటిల్ : యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు
జానర్ : బయోపిక్‌
తారాగణం : బాలకృష్ణ, విద్యాబాలన్‌, దగ్గుబాటి రాజా, కల్యాణ్ రాణా, రానా, సుమంత్‌
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
దర్శకత్వం : క్రిష్‌ జాగర్లమూడి
నిర్మాత : బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి

ప్రస్తుతం టాలీవుడ్‌లలో బయోపిక్‌ల సీజన్‌ నడుస్తోంది. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానటి సినిమా ఘనవిజయం సాధించటంతో ఇప్పుడు మరో మహానటుడి జీవిత కథ వెండితెర మీద అలంరించేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నందమూరి తారక రామారావు జీవితకథను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. తండ్రి పాత్రలో నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ, నిర్మిస్తున్న యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు, ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

న‌టీన‌టులు :
ఒక రకంగా నందమూరి అభిమానులకు ఇది పండగలాంటి సినిమా. అంతా ఒక్క ఎన్టీఆర్‌ పాత్ర చుట్టూనే తిరగటంతో ప్రతీ ఫ్రేమ్‌లో బాలయ్యే తెర మీద కనిపిస్తారు. . అయితే ఎన్టీఆర్‌ యువకుడిగా ఉన్నప్పటి పాత్రలో బాలయ్య లుక్‌ అంతగా ఆకట్టుకునేలా లేదు. నటన పరంగా మాత్రం బాలకృష్ణ తండ్రి పాత్రలో ఒదిగిపోయారు.  సినిమాలో మరో కీలక పాత్ర ఎన్టీఆర్ సతీమణి బసవ రామ తారకం. ఆ పాత్రకు విద్యాబాలన్‌  తన పర్ఫామెన్స్‌తో ఆ పాత్ర స్థాయిని ఎంతో పెంచారు సెటిల్డ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నారు. సినిమాలో కాస్త ఎక్కువ సేపు కనిపించే మరో పాత్ర ఎన్టీఆర్‌ సోదరుడు త్రివిక్రమ్‌ రావుది. ఈ పాత్రలో చాలా కాలం తరువాత దగ్గుబాటి రాజా వెండితెర మీద కనిపించాడు.  అక్కినేని పాత్రలో సుమంత్ జీవించాడనే చెప్పాలి. ఆ పాత్రకు మరొకరిని ఊహించుకోలేనంత స్థాయిలో ఆ పాత్రలో ఒదిగిపోయాడు సుమంత్‌. ఇతర పాత్రల్లో ఎంతో మంది హేమా హేమీల్లాంటి నటులు కనిపించారు. ప్రతీ ఒక్కరు తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. 

విశ్లేష‌ణ‌ :
యన్‌.టి.ఆర్‌ లాంటి మహానటుడి జీవిత కథను వెండితెర మీద ఆవిష్కరించే  బాధ్యతను తీసుకున్న దర్శకుడు క్రిష్‌, నందమూరి అభిమానులను దృష్టిలో పెట్టుకొని సినిమాను తెరకెక్కించాడు. కథా కథనాల మీద కన్నా బాలయ్య అభిమానులను అలరించే ఎలివేషన్‌ షాట్స్‌ మీదే ఎక్కువగా దృష్టి పెట్టాడు. . ముఖ్యంగా కృష్ణుడిగా ఎన్టీఆర్ తెరమీద కనిపించే సన్నివేశానికి థియేటర్లో అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తుంది. ఎన్టీఆర్‌, బసవ రామ తారకంల మధ్య వచ్చే సన్నివేశాలను తన స్టైల్‌లో ఎంతో ఎమోషనల్‌గా చూపించాడు దర్శకుడు. అక్కడక్కడా కథను కాస్త సాగదీసిన ఫీలింగ్‌ కలుగుతుంది. సినిమాకు ప్రధాన బలం కీరావాణి సంగీతం. పాటలతో పాటు నేపథ్యం సంగీతంతో సన్నివేశాల స్థాయిని పెంచారు కీరవాణి. రచయిత సాయి మాధవ్‌ బుర్రా మనసును తాకే మాటలతో మెప్పించారు. జ్ఞానశేఖర్‌ సినిమాటోగ్రఫి సినమాకు రిచ్‌ లుక్‌ తీసుకువచ్చింది. బాలయ్య హీరోగానే కాక నిర్మాతగాను మంచి మార్కులు సాధించారు. .

ప్లస్‌ పాయింట్స్‌ :
బాలయ్య, విద్యాబాలన్‌ నటన
ఎన్టీఆర్‌, బసవ రామ తారకంల మధ్య వచ్చే సన్నివేశాలు
సంగీతం
మాటలు

మైనస్‌ పాయింట్స్‌ :
ఫస్ట్‌ హాఫ్‌లో బాలకృష్ణ లుక్‌
సాగదీత సన్నివేశాలు
సినిమా లెంగ్త్‌

Share.

About Author

Leave A Reply