‘మణికర్ణిక’ చిత్రంలో కంగనా రనౌత్

0

రాబోయే మోస్ట్‌ అవైటెడ్‌ రిలీజెస్‌ జాబితాలో కంగన మణికర్ణిక ప్రముఖంగా విన్పిస్తోంది. బాహుబలి , థగ్స్‌ ఆఫ్‌ హిందూస్తాన్‌ జోనర్‌లోనే భారీ తవిజువల్‌ ఎఫెక్ట్స్‌, గ్రాఫిక్స్‌తో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
క్రిష్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘మణికర్ణిక’. చిత్రంలో ఝాన్సీ లక్ష్మిబాయ్ పాత్రలో కంగనా రనౌత్ నటించింది. విజయేంద్ర ప్రసాద్‌ అందించిన కథతో రూపొందిన ఈ చిత్రానికి ఎక్కువ భాగం క్రిష్ దర్శకత్వం వహించి చివరకు వైదొలగగా.. మిగిలిన కొంత పార్ట్‌కి కంగాననే స్వయంగా దర్శకత్వ భాద్యతలు చేపట్టింది. పలు వివాదాలతో వార్తల్లో ఉంటున్న ఈ సినిమా ఫైనల్‌గా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. గాంధీ జయంతి సందర్భంగా తాజాగా ఈ చిత్ర టీజర్ బయటకు వదిలింది చిత్రయూనిట్.

రెండు నిమిషాల నిడివితో విడుదలైన ఈ టీజర్‌లో.. కదనరంగంలో కంగనా కదంతొక్కిన తీరు ప్రేక్షకలోకాన్ని ఆకట్టుకుంటోంది. శత్రు మూకలపై దూకుతూ.. ఝాన్సీ లక్ష్మిబాయ్ చేసిన వీరోచిత పోరాటాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. టీజరే ఇంత ఆకర్షణీయంగా ఉందంటే ఇక సినిమా ఎలా ఉండబోతోంది అనే ఊహాగానాలు మొదలయ్యాయి. జీ స్టూడియోస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాలో దర్శకురాలిగా కంగన పేరే వస్తోందని ఇన్నాళ్లు వచ్చిన ఊహాగానాలకు తెరదించుతూ దర్శకుడిగా క్రిష్ జాగర్లమూడి పేరునే ప్రకటించారు.

Share.

About Author

Leave A Reply