బాస్ మనసు దోచింది..

0

 

ఆ ఆఫీస్ కి బాస్ కార్తీక్.కోపం చాల ఎక్కువ.ఎవ్వరైనా ఆయన ముందు ఇట్టే దొరికిపోవాల్సిందే.అందుకే కార్తీక్ అనగానే ఆఫీస్ లో అంతా భయంతో వణికిపోతుంటారు.ఆలాంటి బాస్ మనసుని సిరి అనే ఓ అల్లరి పిల్ల దోచేసింది.మరి ఆ ఇద్దరి ప్రేమాయణం ఎన్ని మలుపులు తరిగిందనేది తెలియాలంటే ‘నన్ను దోచుకుందువటే’ చిత్రం చూడాల్సిందే, సుధీర్ బాబు కధానాయకుడిగా నటిస్తూ, నిర్మించిన చిత్రమిది.ఆర్.యస్.నాయుడు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.ఈ నెల 21న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.

 

ఇటీవలే ట్రైలర్ ని విడుదల చేసారు.’అక్కడ యు.ఎస్ లో ట్రంప్..ఇక్కడ కార్తీక్’ అంటూ సాగే ట్రైలర్ నవ్వుల్నీ పంచింది.ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ “ఆధ్యంతం వినోదాత్మకంగా సాగె చిత్రమిది.ప్రచార చిత్రాలకి మంచి స్పందన లభిస్తోంది.నాయకానాయికలు పాత్రలకి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యారు.ప్రేక్షకుల అంచనాలకి తగ్గకుండా చిత్రం అలరిస్తుంది.సుధీర్ బాబు, నాభ నటేష్ ల అభినయంతో పాటు, అజనీష్ సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.” అన్నారు.సుధీర్ బాబు మాట్లాడుతూ “ముందస్తు ప్రచారంలో భాగంగా పలు ప్రాంతాలు తిరిగాం.ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన లభించింది.

నా సొంత నిర్మాణ సంస్థలో రూపొందించిన చిత్రం కావడంతో పాటు,’సమ్మోహనం’ వంటి విజయం తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ అంచనాల్ని అందుకునేలా దర్శకుడు చిత్రాన్ని తీర్చిద్దార”న్నారు. ఈ చిత్రంలో నాజర్, తులసి.వేణు, రవి వర్మ. జీవ. వర్షిణి, సౌందరరాజన్, సుదర్శన్ తదితరులు నటించారు.

Share.

About Author

Leave A Reply