దీపావళి కానుకగా ‘సర్కార్’

0

తమిళ హీరో విజయ్‌, దర్శకుడు మురుగదాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం సర్కార్. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారే గానీ, తేదీ ఖరారు చేయలేదు. ఈలోపు అమీర్‌ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌ల ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ నవంబర్‌ 8న దీపావళి బెర్త్ ఖరారు చేసుకుంది.

రెండో రోజుల ముందే ‘సర్కార్‌’ను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం తమిళంలో ఏ సినిమా విడుదల చేయాలన్నా నిర్మాతల మండలి ఆమోదం కావాల్సిందే. ఆ ప్రకారం నవంబర్‌ 6వ తేదీన ‘సర్కార్‌’ విడుదలకు అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ‘సర్కార్‌’లోని ‘ఒరువిరాల్‌ పురట్చి..’ అనే పాటను ఆదివారం సాయంత్రం విడుదల చేశారు.

Share.

About Author

Leave A Reply