జూనియర్‌ దేవరకొండ వచ్చేశాడు.. దొరసానిగా శివాత్మిక..

0

పెళ్లి చూపులు, అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం సినిమాల సక్సెస్‌ తో విజయ్‌ దేవరకొండ ఇమేజ్‌ తారా స్థాయికి చేరింది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో తన తమ్ముడిని కూడా హీరోగా పరిచయం చేస్తున్నాడు.

‘దొరసాని’ అనే చిత్రంతో విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఆనంద్ కొద్ది రోజులుగా ఫిలిం క్రాఫ్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడు. అంతేకాదు ఫిజికల్‌ ఫిట్‌నెస్ కూడా పెంచుకున్నాడు.

‘నిశీధి’ అనే షార్ట్ ఫిలింతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. అక్టోబర్ 10న ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ సినిమా కథ 1980ల నాటి ఓ తెలంగాణ గ్రామానికి సంబంధించినది. ఇందులో ఆనంద్ సరసన జీవితారాజశేఖర్ రెండో కుమార్తె శివాత్మిక హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఈ చిత్రాన్ని సురేష్‌ బాబు సమర్పణలో యష్‌ రంగినేని, మధుర శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Share.

About Author

Leave A Reply