ఆ రోజుల్లో..చంద్రబాబు

0

నందమూరి తారక రామారావుగారి జీవిత చరిత్ర ఆధారంగా తెరెకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ, సాయి కొర్రపాటి,విష్ణువర్ధన్ ఇందు నిర్మిస్తున్నారు.నందమూరి తారక రామారావు పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తున్నారు.

 

ఈ చిత్రంలో ఎన్టీఆర్ అల్లుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రలో యువ కధానాయకుడు రానా దగ్గుబాటి నటిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా చంద్రబాబు నాయుడు ఎలా కనిపించేవారో, ఆ తరహా వేషధారణలో రానా లుక్ ని తీర్చిదిద్దారు.శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకి వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Share.

About Author

Leave A Reply