‘అర్జున్‌రెడ్డి’‌ రీమేక్ లో కైరా అద్వానీ

0

తెలుగు సూపర్‌ హిట్‌ ‘అర్జున్‌రెడ్డి’ సినిమాను హిందీలో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ కథానాయకుడు షాహిద్‌ కపూర్‌ నటిస్తున్నారు. మాతృకకు దర్శకత్వం వహించిన సందీప్‌ రెడ్డి వంగానే దీన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ నెలాఖరున షూటింగ్‌‌ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం తొలుత నటి తారా సుతారియా సంతకం చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు.

ఇప్పుడు ఆ పాత్ర కోసం నటి కియారా అడ్వాణీని తీసుకోవాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఆమె కూడా నటించేందుకు ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

తెలుగు సినిమాలో విజయ్‌ దేవరకొండ, షాలిని పాండే జంటగా నటించిన సంగతి తెలిసిందే. ప్రేమకథతో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అద్భుత వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రాన్ని హిందీతోపాటు తమిళ భాషలోనూ రీమేక్‌ చేస్తున్నారు. తమిళంలో హీరో విక్రమ్‌ కుమారుడు ధృవ్‌ కథానాయకుడు.

Share.

About Author

Leave A Reply